అవినీతి పాలకులను తరిమేసి... కూటమిని ప్రజలు గెలిపించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మహానాడులో తొలిరోజు మాట్లాడిన ఆయన... అక్రమార్కులను శిక్షించే బాధ్యతను మనకు ఇచ్చారన్నారు. దీన్ని చట్టబద్దంగా నెరవేరుద్దామని వ్యాఖ్యానించారు. విధ్వంస పాలకుల స్కాంల లెక్కలు తీస్తున్నామని... ప్రజా సంపద దోచిన వారిని, గాడి తప్పిన నాయకులను, అధికారులను క్షమించే ప్రసక్తే లేదన్నారు. పార్టీ తరపున సేకరించిన విరాళాలు పార్టీ కోసమే కాకుండా... పేదలు, పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామన్నారు. మహానాడు తొలిరోజు ప్రకటన చేయగానే స్పందించి రూ.17 కోట్లకు పైగా విరాళాలు అందించిన టీడీపీ నేతలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.