China COVID-19: లాక్‍డౌన్‍పై కట్టలు తెంచుకున్న చైనీయుల ఆగ్రహం: ఏం చేశారంటే?
కొవిడ్-19 ప్రభావం కారణంగా సుదీర్ఘంగా సాగుతున్న లాక్‍డౌన్‍పై చైనీయుల్లో కోపం కట్టలు తెంచుకుంది. ఇంకెన్నాళ్లీ ఆంక్షలు అంటూ చైనాలోని గ్వాంగ్‍జో నగర ప్రజలు ఆందోళన నిర్వహించారు. ఇది కాస్త హింసాత్మకంగా మారింది. క్వారంటైన్ కేంద్రంలోకి వెళ్లేందుకు అక్కడి వారు నిరాకరించారు. బారికేడ్లను కూడా ధ్వంసం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‍గా మారాయి. గ్వాంగ్‍జోలోని కొన్ని చోట్ల కొవిడ్ టెస్టింగ్ సెంటర్లను కూడా ప్రజలు ధ్వంసం చేశారు. పోలీస్ వాహనాలను పగులగొట్టారు. కరోనాను నియంత్రించేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‍పింగ్ తీసుకొచ్చిన జీరో-కోవిడ్ పాలసీని ఆ దేశ ప్రజలు తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తోంది. కాగా చైనాలోని చాలా చోట్ల ఇప్పటికీ కొవిడ్-19 విజృంభిస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను చూడండి.