China - Taiwan Tensions : కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు? తైవాన్‍ను రెచ్చగొడుతున్న చైనా
China - Taiwan Tensions : చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధ భయాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా తైవాన్ జలసంధి సమీపంలో చైనాకు చెందిన యుద్ధ విమానాలు, బాంబర్లు సంచరించాయి. ఈ చర్యతో తైవాన్‍ను డ్రాగన్ దేశం మరోసారి రెచ్చగొట్టినట్టయింది. నవంబర్ 12వ తేదీన తైవాన్ సమీపంలో చైనాకు చెందిన ఆరు షెన్యాంగ్ జే-11, నాలుగు జే-16 యుద్ధ విమానాలు తిరిగాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే నాలుగు జే-10 యుద్ద విమానాలు, ఓ యాంటీ సబ్‍మెరేన్ విమానం, మూడు బాంబర్లను తైవాన్ సైన్యం గుర్తించింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.