China Covid Protests: వీడియోలు డిలీట్ చేయండి: ఆందోళనకారులపై చైనా పోలీసుల జులుం
China Covid Protests: చైనా ప్రభుత్వంపై అక్కడి ప్రజలు రగిలిపోతున్నారు. అధ్యక్షుడు షీ జిన్పింగ్ అమలు చేస్తున్న జీరో కొవిడ్ పాలసీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. క్రమంగా ఈ నిరసనలు అన్ని నగరాలకు విస్తరిస్తున్నాయి. షీ జిన్పింగ్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు చైనీయులు. అయితే ఆందోళనలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటికి రాకుండా, ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది జిన్పింగ్ ప్రభుత్వం. దీంతో ఆందోళనకారుల ఫోన్లను బలవంతంగా లాక్కొని వీడియోలు, ఫొటోలను కొందరు పోలీసులు డిలీట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటికి వచ్చాయి. మొబైళ్లను ఇవ్వని వారిపై చైనా పోలీసులు.. జులం ప్రదర్శించారు. దీంతో పాటు ఆన్లైన్లోనూ ఈ ఆందోళనకు సంబంధించిన వీడియోలను చైనా ప్రభుత్వం కట్టడి చేస్తోంది. అయితే వీపీఎన్ సాయంతో కొందరు చైనీయులు.. ఆందోళనలకు వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో పోస్ట్ చేస్తూ.. బయటికి ప్రపంచానికి చూపిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.