తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులతో కాంగ్రెస్ నాయకులు మాట్లాడటంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే హైహెస్ట్ నిరుద్యోగం ఉందన్నారు. కాంగ్రెస్ నిరుద్యోగులే విద్యార్థులతో మాట్లాడారని అన్నారు. నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత.. తెలంగాణలో పేదలు తగ్గారని చెప్పారు. రైతులు, మహిళలకు సాయం సహా అనేక విధాలుగా ప్రజలను ఆదుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.