వివేకా హత్య కేసుతో ఎంపీ అవినాష్ కి సంబంధం ఉందని తేలితే రాజకీయాలకు స్వస్తి చెబుతానని వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. వివేకా రక్తాన్ని జగన్ చొక్కాకి రాయాలని చూస్తున్నారన్న రాచమల్లు.. అవినాష్ ని బలిపశువును చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన కేసును.. రెండో పెళ్లి కోణంలో విచారణ ఎందుకు చేయరని ప్రశ్నించారు.