భారత్-పాకిస్తాన్ దాడుల్లో మురళీ నాయక్ వీరమరణం చెందిన సంగతి తెలిసిందే. ఆదివారం మురళీ అంత్యక్రియలు అనంతపురం జిల్లా గోరంట్లలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం వీర జవాన్ మురళీ కుటుంబాన్ని పరామర్శించారు. వైసీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇక డబ్బుని ఇవాళ మాజీ మంత్రి ఉష శ్రీచరణ్ మురళీ కుటుంబానికి అందజేశారు.