YCP MPs On Budget 2023: ‘పోలవరం ప్రస్తావన లేకపోవడం బాధాకరం’
- Union Budget 2023: కేంద్ర బడ్జెట్‌పై ఢిల్లీలో వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. మిథున్‌రెడ్డి స్పందిస్తూ.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు లేకపోవడం నిరాశ కలిగిందన్నారు. రైల్వే కారిడార్ గురించి కూడా ప్రస్తావవించలేదన్నారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి జగన్... ప్రధానమంత్రితో పాటు ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లారని గుర్తించారు. విభజన హామీలపై పార్లమెంటులో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం నిధుల ప్రస్తావన లేకపోవటం బాధాకరమని చెప్పారు. ఏపీ హక్కులపై పార్లమెంట్ లో పోరాడుతామన్నారు.