నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రోద్బలంతోనే తనపై ఏసీబీ కేసు నమోదైందని మాజీ మంత్రి విడదల రజిని ఆరోపించారు. తనపై ఎందుకో ఎంపీకి విపరీతమైన కోపమన్న ఆమె.. 2020 వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తన ఫోన్ నంబరుతోపాటు ఇంట్లో వాళ్ల నంబర్లు, సిబ్బంది నంబర్ల కాల్ డేటా తీసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే కాల్‌డేటా తీస్తారా... తన వ్యక్తిగత జీవితంలోకి ఎందుకు రావాలనుకున్నారో అంతటి నీచమైన ఆలోచన ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.