కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం 3,32,671 కోట్లు అప్పు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం 12 నెలల్లోనే 1,37,546 కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. కేసీఆర్ 8 లక్షల స్క్వేర్ ఫీట్లలో రూ.616 కోట్లతో అద్భుతమైన సెక్రటేరియట్ నిర్మించారని అన్నారు. ఇటు చంద్రబాబు 53 లక్షల స్క్వేర్ ఫీట్లలో సెక్రటేరియట్ నిర్మించడం ఏంటని ప్రశ్నించారు. ఎందుకు అంత భూమి అని నిలదీశారు.