వైసీపీ అధినేత జగన్.. ఏపీ సీఎం అయిన తర్వాత మారిపోయారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అన్న అంటే తనకు కోపం లేదని అన్నారు. జగన్ జైలుకు పోయినపుడు వైసీపీకి ఉనికి లేకుండా పోతుందని ఏ పదవీ ఆశించకుండా 3200 కిలోమీటర్లు నిస్వార్థంగా పాదయాత్ర చేశానని చెప్పారు. ysrcp సోషల్ మీడియా నేను చేసిన త్యాగం మర్చిపోయిందని షర్మిల భావోద్వేగమయ్యారు.