ఏపీలో పరిస్థితులు చూస్తుంటే బీహార్‌ను తలపిస్తున్నాయని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలన్న జగన్.. పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.