రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందని ఏపీ మాజీ సీఎం జగన్ విమర్శించారు. కడప జిల్లా తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను జగన్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ... ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్యూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు.