Vijayawada Gunadala CI Overaction| సీఐ ఏంటిది.. కూటమి సర్కారులో పోలీసులు ఇంతేనా?
- సివిల్ వ్యవహారంలో విజయవాడ గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. అసలు విషయం ఏంటంటే.. గుణదలలో ఎస్‌ఎల్వీ కైలాస్ హైట్స్, రియల్ ఎస్టేట్ యజమాని దేవినేని శ్రీహరి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. తమ గోడను కూలగొట్టారంటూ ఎస్‌ఎల్వీ యజమాని ఫిర్యాదు ఆధారంగా అక్టోబర్ 23న దేవినేని శ్రీహరిపై గుణదలలో కేసు నమోదు చేశారు. ఆ తరువాత సీఐ శ్రీనివాస్ ఏకంగా దేవినేని శ్రీహరి ఇంటికి వెళ్లి దాడి చేశారు. వ్యక్తిగత కక్షతోనే సీఐ దాడికి పాల్పడ్డారని, రౌడీ షీట్ తెరుస్తానని బెదిరించారని దేవినేని శ్రీహరి ఆరోపిస్తున్నారు. సివిల్ వివాదంలో సీఐ తలదూర్చడంపై సర్వాత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షం నుండి విమర్శలు వస్తున్నాయి.