Tomato price drops | మూడు నెలల కింద కిలో రూ.300.. నేడు 30 పైసలకూ కొనే దిక్కులేదు
- జులై చివర్లో ఆకాశాన్ని అంటిన టమాట ధర, ప్రస్తుతం పాతాళంలోకి పడిపోయింది. మూడు నెలల క్రితం కిలో రూ.300 పలికి, కొనుగోలుదారులను భయపెట్టిన టమాటా.. ఇప్పుడు రైతుల్ని రోడ్డున పడేస్తుంది. కనీసం కేజీ 30 పైసలకూ కొనే దిక్కులేకుండా పోయింది. ఆగష్టు మాసంలోనే పరిస్థితి తలకిందులైంది. ఏపీలోని నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్, కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో గురువారం టమాట ధర పూర్తిగా పతనమైంది. టమాటా మార్కెట్ లో 25 కేజీల బాక్స్ రూ.10 నుంచి రూ.35 వరకు పలికింది. అంటే కేజీ ధర దాదాపు 30 నుంచి 40 పైసలు. అన్నదాతకు కనీసం రవాణా చార్జీలు రాని పరిస్థితి నెలకొంది.