జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజలు సమస్యలు చెప్పుకోడానికి వస్తుంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. ఎక్కడా నిరసనకు పిలుపునివ్వకున్నా, గృహ నిర్బంధం ఎలా చేస్తారని పోలీసులను ఆమె నిలదీశారు. ప్రభుత్వం ఎందుకు భయపడుతోందన్నారు. కలెక్టర్ వద్దకు కూడా వెళ్లనివ్వరా అని అడిగారు. దొంగతనం చేయటానికి వెళ్లటం లేదని, నోటీసులు తీసుకోనని పోలీసులకు ఆమె తెగేసి చెప్పారు. ఇక పోలీసుల చర్యతో వంగలపూడి అనిత ఇంటి వద్దనే నిరసన తెలిపారు.