ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రామరాజ్యం కావాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆదివారం ఆకాంక్షించారు. శ్రీరామనవమి నాడు నగరంలో జరిగిన శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లు హిందువుగా పుట్టినందుకు గర్వపడాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడేదే హిందూ ధర్మమని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామ మందిరం కట్టిన సంగతిని గుర్తు చేశారు.