తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావటంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పటాసులు పేల్చి.. స్వీట్లు తినిపించుకున్నారు. న్యాయం,ధర్మం గెలిచిందని పార్టీ నేతలు అన్నారు. ఇక నుంచి ఆట మెుదలవుతోందని అనంతపురం జిల్లా TDP నేత పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు ఇవాళ సాయంకాలం చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలవుతారని తెలుస్తోంది. చంద్రబాబు విడుదలైన అనంతరం విజయవాడకు వచ్చి ఆ తర్వాత తిరుపతికి వెళ్లనున్నట్లు తెలిసింది. ఇక ఆయన అనారోగ్యం రీత్యా నాలుగు వారాలపాటు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో 53 రోజుల అనంతరం ఆయన సెంట్రల్ నుంచి బయటకు రానున్నారు.