ఏపీలో లిక్కర్ స్కాం జరిగిందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్ సభలో ఆరోపణలు గుప్పించారు. వైసీపీ పాలనలో రూ.99 వేల కోట్ల మద్యం వ్యాపారం జరిగిందని లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. అందులో రూ.18 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని, మరో రూ.4 వేల కోట్లను బినామీల పేరు మీద దుబాయ్, ఆఫ్రికాలకు తరలించినట్లు ఆరోపించారు.