ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావటం తథ్యమని టిడిపి నేత బుద్ధా వెంకన్న చెప్పారు. చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని.. అదే రోజు పార్టీ అధ్యక్షుడిగా లోకేష్ ని ఎన్నిక చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆత్మ కథ రాసుకుంటే దానిలో నాకు ఒక పేజీ కచ్చితంగా ఉంటుందన్నారు. రాజకీయ నాయకుడి పాదాలకు రక్తంతో అభిషేకం చేసిన చరిత్ర లేదన్నారు. ఆ పని నేను చేశానని చెప్పారు.