లోన్ యాప్ ఆగడాలు ఆగటం లేదు. లోన్ రూపేణ డబ్బు ఆశ చూపి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. చివరి తీసుకున్న అసలు కన్నా వడ్డీలు భారం కావటంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బాధితులు. తాజాగా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటుచేసుకుంది. ఇంట్లో తెలియకుండా లోన్ యాప్ లో రూ.10 వేల రుణ తీసుకున్నాడు వంశీ. అయితే యాప్ నిర్వాహకులు రూ. లక్ష కట్టాలంటూ వంశీని వేధించారు.