హిందువులకు ఆవు ఎంతో పవిత్రమైనది. భక్తి శ్రద్దలతో పూజిస్తారు. పండుగల వేళ వాటికి శుభ్రంగా స్నానం చేయిస్తారు. బొట్టు పెట్టి, ఇంట్లో చేసుకున్న వంటలను మెుదట వాటికే పెడుతుంటారు. భారతీయ సంస్కృతిలో ఆవులు, ఎద్దులకు విశిష్ట స్థానం ఉంది. మూగజీవాల పట్ల తమకున్న ప్రేమను చాటుకుంటారు. కృష్ణా జిల్లాకు చెందిన మైధిలీ అనే మహిళ కూడా తాను పెంచుకుంటున్న ఆవుకు శ్రీమంతం చేసింది. బంధువులను, ఇంటి పక్కన వారిని సైతం ఈ కార్యక్రమానికి పిలిచింది. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ గోమాతకు శ్రీమంతం చేశారు. ప్రస్తుతం ఈ గోమాత శ్రీమంతం వీడియో వైరల్ గా మారింది.