ఆర్పీఎస్జీ గ్రూప్ అధినేత, లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం స్వామి వారి సేవలో పాల్గొని, భారీ బంగారు ఆభరణాలను విరాళంగా అందజేశారు. ఐదు కోట్ల రూపాయలతో చేయించిన వెంకటేశ్వర స్వామి చేతులను ఆలయ అధికారులకు ఇచ్చారు. కుటుంబ సమేతంగా తిరుమల వచ్చిన ఆయనకు వేద పండితులు ఆశీర్వాదం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందించారు.