రౌడీ తన బలాన్ని చూపించి ఏ విధంగా రౌడీయిజం చేస్తాడో.. ఆ విధంగా చంద్రబాబు తన శక్తితో వ్యవస్థల్ని మ్యానిఫ్యులేట్ చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇవాళ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన సజ్జల సోషల్ మీడియాలో వార్నింగ్ లు ఇస్తే భయపడమన్నారు. ఇక్కడ భయపడేవారు లేరని వార్నింగ్ ఇచ్చారు. మరోసారి YCP అధికారంలో చేపట్టబోతోందని ఆయన చెప్పారు.