పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించాలని జబర్దస్త్ ఫేమ్ రైజింగ్ రాజు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మసీదులో అల్లా ఉండాలని, చర్చిలో ఏసయ్య ఉండాలని, తిరుపతి కొండపై వెంకన్న ఉండాలని.. అలాగే మన అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పవన్ కి ఓటేసి నిజాయితీని గెలిపించాలని కోరారు.