రంగన్న మృతిపై పులివెందుల టీడీపీ ఇన్ చార్జ్ బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్నను చంపి పోలీసులపై నింద వేయాలని చూస్తున్నారని అన్నారు. వైస్ వివేకాను హత్య చేసిన తర్వాత సాక్ష్యాలు లేకుండా చేశారని మండిపడ్డారు. వాచ్ మెన్ రంగన్నది సాధారణ మృతి కానే కాదన్నారు B.TEH రవి. ముఖ్యమంత్రి చంద్రబాబుకి, పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేసిన రవి.. వాచ్మెన్ రంగన్న మృతిపై సమగ్ర విచారణ చేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలని కోరారు.