కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేశారు. చంద్రబాబుతోపాటు పవన్, లోకేష్ సహా పలువురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అయిన తర్వాత మోదీ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మెగా అభిమానలకు పట్టలేనంత సంతోషాన్ని ఇచ్చింది. పవన్, మెగాస్టార్ చిరంజీవి చేయి పట్టుకొని మోదీ ప్రజలు అభివాదం చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.