Nara Lokesh Padayatra : పలమనేరులో టెన్షన్.. నారా లోకేశ్ ప్రచార రథం సీజ్
- Nara lokesh campaign vehicle seized: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్‌లోని ప్రచార రథాన్ని పలమనేరులో పోలీసులు సీజ్ చేశారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం పలమనేరులో లోకేశ్ పర్యటిస్తున్నారు. పట్టణంలో పాదయాత్ర కొనసాగుతుండగా ఓ చోట ప్రజలను ఉద్దేశించి ప్రచార రథం పైకి ఎక్కి ఆయన మాట్లాడారు. లోకేశ్ మాట్లాడి కిందికి దిగిన తర్వాత ఆ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. పాదయాత్రలో మైక్‌కు అనుమతి లేదని.. నిబంధనలకు విరుద్ధమంటూ సీజ్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ లోకేశ్ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.