రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతోంది. తాడేపల్లిలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ జెండాను ఆవిష్కరించారు. అయితే ఈ సందర్భంగా బుధవారం పల్నాడు జిల్లా రెంటచింతలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళి అర్పించేందుకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి వెళ్లారు. ఈ క్రమంలోనే విషయం తెలుసుకొని రెంటచింతల ఊరు బయట పోలీసులు నిలువరించారు. దీంతో పోలీసులతో పిన్నెళ్లి వాగ్వాదానికి దిగారు.