ఏపీలోని అనకాపల్లి జిల్లా పరవాడ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోమని ఓ ఆర్మీ ఉద్యోగిని బలవంత పెట్టారు. ఈ క్రమంలోనే ఓటీపీ చెప్పమని ఆర్మీ ఉద్యోగిని అడగ్గా.. ఖాకీ డ్రస్ కు నేమ్ ప్లేట్ లేదని, ఐడీ కార్డు చూపిస్తే ఓటీపీ చెబుతానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే నలుగురు పోలీసులు.. ఆర్మీ ఉద్యోగిపై దాడి చేశారు. ఆటోలో ఎక్కించుకొని స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు, అనుచితంగా ప్రవర్తించిన పోలీసులను ఏఆర్ కు అటాచ్ చేశారు. ఇటువంటి దాడులను సహించమని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఏపీ పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్మీ ఉద్యోగిపైనే ఈ పోలీసులు దాడి చేస్తే, సామాన్య ప్రజల పరిస్థితి ఏపీలో ఎలా ఉందో అర్ధమవుతోందంటున్నారు.