తిరుపతి కార్పొరేషన్ లో జనసేన నేత ఆరణి శివ కుమార్ అధికారిక సమావేశాలు నిర్వహించారు. IAS అధికారిణి అయిన మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ పక్క కూర్చొని మాట్లాడారు. అధికారులతో సమక్షంలోపాటు ఉన్నతాధికారులకు పలు ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్న జయరాం కుమారుడు శివకుమార్ ఇలా ఓవర్ యాక్షన్ చేయటం ఏంటని తిరుపతి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. షాడో ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తున్నారని అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు.