పల్నాడు ప్రాంతంలో పోలింగ్ రోజున పోలీసులు, రెవెన్యూ అధికారులు టిడిపికి కొమ్ముకాశారని నరసరావుపేట వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తమ ఇళ్లపై టిడిపి నేతలు దాడికి దిగితే, తమని హౌస్ అరెస్టు చేశారని విమర్శించారు. మాకు వర్తించే ఈసీ రూల్స్ టిడిపికి వర్తించవా అని గోపిరెడ్డి ప్రశ్నించారు