Mla perni nani | చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి రావాలని సవాల్
- చంద్రబాబుకు సేవ చేసేందుకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు మేలు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. జగన్ ను తిట్టేందుకే జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారని పేర్నినాని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కలిసి రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబును విమర్శించే వాళ్లను తిట్టడానికి బందరులో ఇవాళ పవన్ కళ్యాణ్ సభ పెట్టారని పేర్నినాని విమర్శించారు. పవన్ కళ్యాణ్ మారే పరిస్థితి లేదన్నారు.