రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉందని ఆమె అన్నారు. ఈ హత్య కేసులో సీబీఐ కూడా జగన్‌ను విచారించిందని గుర్తు చేశారు. తన భర్త హత్యకు సంబంధించి రాజకీయ కుట్రలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని అన్నారు.