తిరుమల శ్రీవారి దర్శనానికి కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు వెళ్లారు. బుధవారం రాత్రికి తిరుమలలో బస చేసిన చంద్రబాబు ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమలలో టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు పలకరించారు. అయితే తిరుమలలో అతిథిగృహం దగ్గర పోలీసులు పరదాలు కట్టారు.వాటిని చూసిన లోకేష్ అధికారులను ప్రశ్నించారు. ఇంకా పోలీసులు పరదాలు కట్టడం ఏంటని సెటైర్లు వేశారు.