ఏపీ మంత్రి లోకేష్ తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో పర్యటించారు. ‘మన ఇల్లు– మన లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. సొంత ఖర్చులతో బట్టలు పెట్టి మరీ లబ్ధిదారులకు లోకేష్ ఇంటి పట్టాలను ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.