మదనపల్లి ఫైళ్ల దగ్ధం ఘటనలో అధికారుల సస్పెండ్ పై మంత్రి అనగాని సత్య ప్రసాద్, ఆ శాఖ ఉన్నతాధికారి వివరణ ఇచ్చారు. కీలకమైన ఫైళ్ల దగ్ధం వెనుక వాళ్ల ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈ మేరకు ఆ వివరాలను మీడియాకు తెలిపారు. మరోవైపు కోట్ల రూపాయల భూములు సొంత వాళ్లకి వైఎస్ జగన్ ధారాదత్తం చేశారని మంత్రి మండిపడ్డారు. ఒకచోట 22 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని 15 లక్షలకే కట్టబెట్టారని అన్నారు. వాటిపై విచారణ చేసి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.