Janasena Chief Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు . విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దస్త్రాలపై సంతకాలు చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, RWS, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీ శాఖ మంత్రిగానూ ఆయన బాధ్యతలు చేపట్టారు.