Janasena Sand Art: మోదీ గారూ.. పవన్‌కు జెడ్ ప్లస్ భద్రత కల్పించండి
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతున్నారు జనసేన కార్యకర్తలు. అయితే విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి విన్నవించేలా.. శుక్రవారం విశాఖలోని యారాడ సముద్రతీరంలో సైకతశిల్పం ఏర్పాటు చేశారు. ప్రజల నాయకుడైన పవన్ కు ప్రాణహాని ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇవ్వాలని కోరారు. జనసేన యూత్ నాయకుడు ధరేంద్ర ఆధ్వర్యంలో విశాఖ అక్కయ్యపాలేనికి చెందిన కళాకారుడు మోహన్ ఈ శాండ్ ఆర్ట్ ను రూపొందించారు. మరోవైపు ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. ఏపీలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు.