2024 ఎన్నికలకు పొత్తులో భాగంగా ఏపీలో జనసేన పార్టీకి 24 సీట్ల కేటాయింపుపై జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది స్పందించారు. టీడీపీ, జనసేన పొత్తులో జనసేనకు 24 సీట్లు కేటాయించడంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీ నేతలే పవన్ కల్యాణ్‌ను తిడుతున్నారు. ఆయనపై అలుగుతున్నారు. జనసేన జెండాలను తగులబెడుతున్నారు. ఇవన్నీ చూస్తే చాలా బాధేస్తుంది. ఒకసారి ఆవేశంతో కాకుండా ఆత్మసాక్షిగా ఆలోచించండని హైపర్ ఆది భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీకి సపోర్ట్ చేసే మనమే ఇంత ఆలోచిస్తున్నప్పుడు, పార్టీ పెట్టిన వ్యక్తి ఇంకెంత ఆలోచించాలనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించాడు.