కర్నూలు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన కేసులో కీలక నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలూరు కాంగ్రెస్ ఇంఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ అరెస్ట్ అయ్యారు. దీంతో కేసు కొత్త మలుపు తిరిగింది. రైల్వే కాంట్రాక్టుల వ్యవహారమే హత్యకు కారణమనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.