ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలో ఏర్పాటు జరిగిన వేడుకల్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నవంబరు 1ని అవతరణ దినోత్సవంగా నిర్వహించేవారు. 2014 జూన్ 2 న రాష్ట్రం విడిపోవడంతో తెలంగాణలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై గతంలో కొంత గందరగోళ పరిస్ధితి ఉండేది. అయితే ఆంధ్రప్రదేశ్ ఒరిజనల్ బ్రాండ్ ఇమేజ్‌ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో లాగానే నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని కేంద్రం చెప్పింది. దీంతో నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవాన్ని జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది