రాప్తాడులో జరిగిన వైసీపీ అధినేత జగన్ హెలికాప్టర్ ఘటనలో పోలీసుల ముందు విచారణకు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై హాజరు అయ్యారు. హైకోర్టు ఆదేశాలతో 41 a నోటీసులు ఇచ్చిన పోలీసుల.. విచారణ చేశారు. ఆ తర్వాత మాట్లాడిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి.. హెలికాప్టర్ వద్ద జరిగిన ఘటనలో తన ప్రమేయం లేదన్నారు. పోలీసుల భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తనపై కేసులు పెట్టారని చెప్పారు. మొత్తం 102 ప్రశ్నలు అడిగారన్న తోపుదుర్తి.. అన్నింటికీ సమాధానం చెప్పానని వెల్లడించారు.