చంద్రబాబు పెట్టిన మెుదటి సంతకం చిత్తు కాగితంతో సమానమని మాజీ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయలేక ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అక్రమ కేసులకు వైసీపీ నేతలు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. దమ్ముంటే ఫైబర్ నెట్, స్కిల్ స్కామ్‌పై విచారణ జరిపించాలని రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబుకు సపోర్ట్ చేసే వాళ్లు భవిష్యత్‌లో జైలులో ఉంటారని హెచ్చరించారు.