ఇవాళ ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ దాడులు జరిగాయి. అనంతరం జోగి రమేష్ కుమారుడి ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మాజీ మంత్రి స్పందించారు. ఏమీ తెలియని తన కుమారుడి ప్రభుత్వం అరెస్ట్ చేసిందని బాధ పడ్డారు. దయచేసి ఆ విషయంపై కూటమి ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. ఆ రోజు చంద్రబాబు ఇంటి పైకి దాడికి వెళ్లలేదని అన్నారు.