ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024-25ను సంబంధించిన ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఐదేళ్లుగా రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం దక్కిందని ఆయన పేర్కొన్నారు. మహాత్మా గాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి బుగ్గన ప్రారంభించారు. సీఎం జగన్ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తారని అన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తొలి మూడు నెలలకు వర్తింపజేస్తారు.