Tirupati: తిరుపతికి కొత్త సొబగులు..అందుబాటులోకి డబుల్ డెక్కర్ బస్సులు
- తిరుపతి రోడ్లపై ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సును అందుబాటులోకి తెచ్చారు. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ తర్వాత డబుల్ డెక్కర్ బస్సు అందుబాటులో ఉన్న నగరంగా తిరుపతి చరిత్ర సృష్టించింది. ఈ మేరకు బస్సుకు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పూజలు చేశారు. ఇక నుంచి తిరుపతి రోడ్ల మీద ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు ప్రయాణం ఉంటుందని తెలిపారు. బస్సు బాధ్యతలను ఆర్టీసీకి అప్పగిస్తామన్నారు. నిర్వహణలో సగభాగం నగరపాలిక భరించడానికి సిద్ధంగా ఉందని అభినయ్‌రెడ్డి తెలిపారు. త్వరలో నగర రోడ్లపై బస్సును అందుబాటులో తీసుకొస్తామని వివరించారు.