ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. విజయనగరం పర్యటనలో ఈ కార్యక్రమానిన్ని చేపట్టారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత ఏడాదికి మిగతా ఏడు కాలేజీలలో అకడమిక్ తరగతులు ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి వర్చువల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం.. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఓ మెడికల్ విద్యార్థిని మాట్లాడింది. తనలాంటి పేద విద్యార్థులకు సైతం వైద్య విద్య అందేటట్లు చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది. విద్యాభ్యాసం పూర్తైన తర్వాత.. సీఎం జగన్ లా సేవ చేస్తానని చెప్పింది.