jagan rides tractor: ట్రాక్టర్ నడిపి ఉత్సాహం నింపిన ముఖ్యమంత్రి-cm ys jagan rides tractor after launching ysr yantra seva scheme ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Jagan Rides Tractor: ట్రాక్టర్ నడిపి ఉత్సాహం నింపిన ముఖ్యమంత్రి

jagan rides tractor: ట్రాక్టర్ నడిపి ఉత్సాహం నింపిన ముఖ్యమంత్రి

Published Jun 07, 2022 02:07 PM IST HT Telugu Desk
Published Jun 07, 2022 02:07 PM IST

  • వైయస్సార్‌ యంత్ర సేవా పథకం రాష్ట్ర స్ధాయి మెగా పంపిణీలో భాగంగా 3800 ఆర్బీకే స్ధాయి యంత్రసేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 క్లస్టర్‌ స్ధాయి యంత్ర సేవా కేంద్రాలకు 320 కంబైన్‌ హార్వెస్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని గుంటూరులో సీఎం వైయస్‌.జగన్‌ ప్రారంభించారు. 5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ.175 కోట్ల సబ్సిడీ జమ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ఓ ట్రాక్టర్ నడిపి రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు.
  • ‘రైతులు గ్రూపులుగా ఏర్పడి కేవలం 10 శాతం డబ్బులు కడితే చాలు.. వాళ్లకు గ్రామంలో వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లతో సహా ఉపకరణాలన్నీ కూడా ఆర్బీకే పరిధిలోనే సరసమైన ధరలకే అందుబాటులో ఉంచే గొప్ప కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగానే ఈరోజు రూ. 2016 కోట్లతో ప్రతి ఆర్బీకే స్ధాయిలోనూ రూ.15 లక్షలు విలువగల 10,750 వైయస్సార్‌ యంత్రసేవా కేంద్రాలను స్ధాపించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇవి కాక వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కోక్కటి రూ. 25 లక్షలు విలువ గల కంబైన్ హార్వెస్టర్లతో కూడిన 1615 క్లస్టర్‌ స్ధాయి యంత్రసేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో 10,750 రైతు భరోసా కేంద్రాలన్నింటికీ కూడా ఈ సేవలన్నీ విస్తరిస్తాయి..’ అని ముఖ్యమంత్రి జగన్ వివరించారు.

More