CM Jagan On Constitution Day: భారత రాజ్యాంగం ఎంతో గొప్పది
- indian constitution day celebrations at vijayawada: విజయవాడలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి గవర్నర్, సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్... భారతీయులకు క్రమశిక్షణ నేర్పే నిబంధనల పుస్తకమే రాజ్యాంగమని వ్యాఖ్యానించారు. 72 ఏళ్లుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాగతులను, భావజాలాలను రాజ్యాంగం మారుస్తూనే ఉందని చెప్పారు. రాజ్యాంగమే మన సంఘసంస్కర్త అని సీఎం జగన్ అన్నారు. భారత రాజ్యాంగం ఎంతో గొప్పదన్న ఆయన.. అందరికీ క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ అని చెప్పుకొచ్చారు. రాజ్యాంగం అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో విజయవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు.